Monday, July 28, 2025

అదరగొట్టిన మొదటి పాట

- Advertisement -
- Advertisement -

హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’(Mirai) లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక మొదటి సింగిల్ వైబ్ ఉంది… ప్రోమో సంచలనం సృష్టించింది. ఇప్పుడు టీం మొదటి సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేసింది. పవర్‌ఫుల్ కంపోజిషన్‌తో ఈ సాంగ్ అదిరిపోయింది. కృష్ణకాంత్ లిరిక్స్ హీరో భావోద్వేగాన్ని, హీరోయిన్ అందాన్ని అద్భుతంగా హైలైట్ చేశాయి.

తేజా సజ్జా ప్రతి ఫ్రేమ్‌లో ఎనర్జీ, ఛార్మ్, డ్యాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టాడు. అర్మాన్ మాలిక్ తన గాత్రంతో ఆకట్టుకున్నాడు. విజువల్‌గా పాట (Visual song) నెక్స్ లెవెల్‌లో ఉంది. రితికా నాయక్ గ్లామరస్ లుక్‌లో మెరిసిపోయింది. మనోజ్ మంచు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2డి, 3డి ఫార్మాట్లలో 8 భాషల్లో థియేటర్లలో విడుదలకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News