‘కుబేర’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ’ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ భాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. తాజా గా మేకర్స్ కొత్తగుందే సాంగ్ రిలీజ్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సాంగ్‌ని ఫీల్‌గుడ్ మెలోడీ కంపోజ్ చేశారు. సింగర్స్ కృష్ణ తేజస్వి, శ్వేతా మోహన్ గా త్రాలు సాంగ్‌కి మరింత మెలోడీ వైబ్‌ని తీసుకొచ్చాయి.
సామ్రాట్ నాయుడు ఆ కట్టుకునే లిరిక్స్ అందించారు. సాంగ్ లో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. వినగానే కనెక్ట్ అ య్యే ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్‌లో టా ప్ ట్రెండింగ్‌లో ఉంది. శ్రీ వేదక్షర మూ వీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారా వు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాం డే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇడ్లీ కొట్టు సినిమా తెలుగు, తమిళ్‌లో అక్టోబర్ 1న విడుదల కానుంది.
Also Read : వచ్చే ఏడాదికి కేబుల్ కార్