- Advertisement -
హైదరాబాద్: డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు మద్దతుగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ నివారణలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ ఘనత సాధించిన హైదరాబాద్ నగర కమీషనర్ సి.వి.ఆనంద్, ఆయన బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచానికే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నదే నా ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -