Wednesday, July 16, 2025

ఫోరెన్సిక్ సాక్ష్యం సేకరణలో లోపాలు.. మరణశిక్ష పడిన వ్యక్తిని వదిలిపెట్టిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హత్యాచార కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని ఫోరెన్సిక్ సాక్షాల సేకరణలో లోపాలున్నాయన్న కారణంగా సుప్రీంకోర్టు మంగళవారం నిర్దోషిగా విడిచిపెట్టింది. అంతేకాకుండా డిఎన్‌ఎ శాంపిల్స్ నిర్వహణకు సంబంధించి దేశవాప్తంగా చేపట్టాల్సిన విధి విధానాలపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటినుంచి ఫోరెన్సిక్ సాక్షం ఉన్న అన్ని కేసుల్లోను అవసరమైన అన్ని నిబంధనలు పాటించాక డిఎన్‌ఎ శాంపిల్స్ సేకరణ చేయాలని, వెంటనే వాటిని తగిన విధంగా ప్యాక్ చేయడంతో పాటుగా వాటినన్ని టినీ డాక్యుమెంట్ రూపంలో భద్రపరచాలని సూచించింది.

ఇక ప్రస్తుత కేసులో సేకరించిన డిఎన్‌ఎ సాక్షంలో చాలా లోటుపాట్లున్నాయని, దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ పేర్కొంటూ బెంచ్ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. 2019 మార్చిలో మద్రాసు హైకోర్టు తీర్పుపై నిందితుడు దాఖలు చేసుకున్న పిటిషన్ పై బెంచ్ విచారణ జరిపింది. హత్య, అత్యాచారం కేసులో కింది కోర్టు నిందితుడికి విధించిన మరణ శిక్షను మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News