Thursday, August 14, 2025

రేణుకా స్వామి హత్యకేసులో నటుడు దర్శన్‌కు బెయిల్ రద్దు

- Advertisement -
- Advertisement -

రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో గురువారం అతడిని మళ్లీ అరెస్టు చేశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును పక్కన పెడుతూ న్యాయమూర్తి పార్దివాలా, న్యాయమూర్తి ఆర్.మహా దేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రేణుకా స్వామి హత్యకేసులో ప్రధాన నిందితురాలైన పవిత్రా గౌడ్‌ను పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్న తర్వాత దర్శన్‌ని కూడా అరెస్టు చేశారు.

బెంగళూరులోని హోసకేరహల్లీలో ఆయన భార్య విజయలక్ష్మి ఇంటి వద్ద అరెస్టుచేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కోర్టుకు లొంగిపోయి అరెస్టు నుంచి తప్పించుకోవాలని దర్శన్ అనుకున్నారని, కానీ అతడు ఎక్కడ ఉన్నడాన్నది పోలీసులు తెలుసుకుని అరెస్టు చేశారని ఆ వర్గాలు తెలిపాయి. కర్ణాటకతమిళనాడు సరిహద్దులో పునాజనూర్ చెక్‌పోస్ట్ వద్ద గురువారం వాహనంలో ఉన్న అతడిని మొదట పోలీసులు గుర్తించారు. ఇదిలావుండగా దర్శన్‌కు గత ఏడాది అక్టోబర్‌లో కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలుచేసింది. కాగా రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపారన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News