కర్నాటక హైకోర్టు నుంచి
జస్టిస్ సుమలత, జస్టిస్
లలితా కన్నెగంటి, పాట్నా
హైకోర్టు నుంచి జస్టిస్
అభిషేక్‌రెడ్డి బదిలీ రాష్ట్ర
హైకోర్టు నుంచి కలకత్తా
హైకోర్టుకు జస్టిస్ సుజయ్‌పాల్
సుప్రీంకోర్టు కొలీజియం
సిఫారసు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల హైకోర్టు న్యా యమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫా ర్సు చేసింది. 11 హైకోర్టులకు చెందిన 21జడ్జీల బ దిలీకి సోమవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గ వాయ్ నేతృత్వంలో సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో కొందరు గతంలో పని చేసిన హైకోర్టులకే తిరిగి బదిలీఅవుతుండడం గమనార్హం. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ కానున్నారు. కర్నాటక హైకోర్టు లో న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ సి సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటిలను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని,. అలాగే ప్రస్తుతం పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న అన్నిరెడ్డి అ భిషేక్ రెడ్డిని కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చే యాలని కొలీజియం సిఫార్సు చేసింది.
కాగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకో ర్టు సిఫార్సు చేసింది. అలాగే గతంలో ఏపి హైకోర్టు లో పని చేసి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా బ దిలీ అయిన బట్టు దేవానంద్‌ను తిరిగి ఎపి హైకోర్టు కు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. వీరేకాకుండా కర్ణాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ వి కామేశ్వర రా వును ఢిల్లీ హైకోర్టుకు , గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జమీర్‌ను కలకత్తా హైకోర్టుకు, గౌహ తి హైకోర్టుకు చెందిన మరో జడ్జి జస్టిస్ మనాష్ రం జన్ పాఠక్‌ను ఒడిశా హైకోర్టుకు , బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ జస్టిస్ వాసుదేవ్ సాంబ్రేను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. అలా గే అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వివేక్ చౌదరిని ఢిల్లీ హైకోర్టుకు, మరో న్యాయమూర్తి జస్టిస్ అ శ్వనీకుమార్ మిశ్రాను పంజాబ్ హర్యానా హైకోర్టుకు ,
గౌహతి హైకోర్టు జడ్జి జస్టిస్ సుమన్ ను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని పేర్కొంది. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ కర్ణాటక హైకోర్టుకు, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు ,అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఓంప్రకాశ్ శు క్లా ఢిల్లీ హైకోర్టుకు , రాజస్థాన్ హైకోర్టు న్యాయమూ ర్తి జస్టిస్ చంద్రశేఖర్ బాంబే హైకోర్టుకు, పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి సుధీర్ సింగ్ పాట్నా హైకోర్టుకు, రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అరుణ్‌కుమార్‌ను ఢిల్లీ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జయంత్ బెనర్జీ కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఒకటి రెండు రోజుల్లో ఆమోదం తెలపవచ్చని భావిస్తున్నారు.