ఫిరాయింపు ఎంఎల్‌ఎల
అనర్హతపై స్పీకర్‌కు సుప్రీం
ఆదేశం న్యాయస్థానమే
అనర్హత వేటు వేయాలన్న
అభ్యర్థన తోసివేత ఆపరేషన్
సక్సెస్ పేషెంట్ డెడ్ సూత్రం
ప్రజాస్వామ్యానికి మంచిది
కాదని హితవు అనర్హత
ప్రక్రియను పొడిగించాలని
ఎంఎల్‌ఎలు కోరరాదని
స్పష్టీకరణ సిజెఐ గవాయ్
నేతృత్వంలోని ధర్మాసనం
కీలక తీర్పు తీర్పు మంచి
పరిణామం : రాష్ట్ర బిజెపి చీఫ్
ఫిరాయింపులపై సమగ్ర చట్టం
తేవాలి : కూనంనేని
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వచ్చిన మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ని సిజె ఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్ నేతృత్వంలోని ధ ర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి సమయం తీసుకోవద్దని సుప్రీం సూ చించింది. పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై న్యా యస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. “ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డైడ్’ అన్న సూత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని వ్యా ఖ్యానించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సు ప్రీంకోర్టు కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సిజెఐ గవా య్ ఆదేశించారు. కాగా, ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యంచేసుకోవచ్చా..లేదా..? అనే అంశంపై వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేశారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వివరాలు..
“పార్టీ మారిన 10 మంది ఎంఎల్‌ఎలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయించాలి. ఏ ఎంఎల్‌ఎ అయినా.. స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయా లు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది. దాన్ని అరికట్టకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉంది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించాం. రాజేష్ పైలట్.. దేవేంద్ర నాథ్ మున్షి లాగా.. అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఆర్టికల్స్ 136, 226, 227లకు సంబంధించి న్యాయ
సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసింది. స్పీకర్ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు.” అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పులో స్పష్టం చేసింది. “స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న తీర్పును పక్కన పెడుతున్నాము. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి, ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎంఎల్‌ఎల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరం.” అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల పిటిషన్లు
బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద, జి.జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ పిటిషన్లు దాఖలు చేశారు. బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు వేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో తొమ్మిదిసార్లు విచారణ జరిగాయి. జస్టిస్ బి.ర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం అన్ని క్షాల వాదనలు విన్న అనంతరం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వు చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు పి.శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్, ఎం.కె. గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్‌లు ఉన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం గురువారం తీర్పు వెలువడింది.