Thursday, August 14, 2025

పర్యావరణాన్ని పరిరక్షిస్తే ఫిర్యాదులు ఉపసంహరిస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగిం ది. పధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ వి నోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీల క వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళి క తో ముందుకు వస్తే గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తామన్నారు. హైదరాబాద్ శివార్లలోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో 1000 చెట్లను నరికివేయడంపై సుమోటోగా దాఖలైన కేసును ధర్మాసనం విచారించింది. అభివృద్ధికి తా ము వ్యతి రేకం కాదని, అయితే ఆ అభివృద్ధి సుస్థిరంగా ఉం డాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణం, వన్యప్రాణుల ప్రయోజనాలను కాపాడుతూనే అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించింది. 400 ఎకరాల  భూమి విషయంలో అడవులు, వన్యప్రాణులు, సరస్సులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసేలా సవరించిన ప్రణాళికను ఆరు వారాల్లోగా సమర్పించాలని స్పష్టం చేసింది.

‘పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. పర్యావరణం కోసం రాష్ట్రం చేస్తున్న చర్యలను అభినందిస్తున్నాం. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. పర్యావరణాన్ని సమ తుల్యం చెయ్యాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయండి. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తాం. నా రిటైర్మెంట్ లోపల వీటన్నింటికీ పరిష్కారం చూపాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల మేరకు చెట్ల నరికివేతను పూర్తిగా నిలిపివేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. అయితే సమగ్ర ప్రణాళికను అందించేందుకు 6 వారాలు సమయం కావా లని కోర్టును కోరగా, ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.

నవంబర్ 24కి తన రిటైర్మెంట్ తేదీ వరకు ప్రతిపాదన తీసుకురావడానికి సమయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సిజెఐ సూచించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని ఈ భూమిలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) ద్వారా వేలం వేయాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం పెద్ద ఎత్తున చెట్లను నరికివేయడంతో పర్యావరణ వేత్తలు, యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఏప్రిల్‌లో విచారణ ప్రారంభించింది. ఏప్రిల్ 3న చెట్ల నరికివేతపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు, క్షేత్రస్థాయి పరిశీలనకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సిఇసి)ని ఆదేశించింది. జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం, గతంలో విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నరికివేసిన అడవిని పునరుద్ధరించాలని, లేదంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపాల్సి ఉంటుందని మే నెలలో హెచ్చరిం చింది. మంచి ప్రతిపాదనతో వస్తే కేసును ఉపసంహరించుకుంటామని, అయితే ధ్వంసమైన అడవిని మాత్రం కచ్చితంగా పునరుద్ధరించాలని కోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News