Thursday, September 11, 2025

క్రికెట్ మ్యాచే కదా.. జరగనివ్వండి: భారత్-పాక్ పోరుపై సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దుకు దాఖలైన పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ తేదీ ఖరారు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోవ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ వచ్చింది. 2025 ఆపియా కప్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం దాయాదులు భారత్ పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

ఆదివారం మ్యాచ్ ఉంది. ఎంతైనా ఇది క్రికెట్ ఆటనే కాదు. దీనిపై తొందరపడి చేసేదేముంది? మ్యాచ్ జరగనివ్వండి, వెనువెంటనే దీని వాయిదాకు పిటిషన్ విచారణ చేపట్టాలా? అని ధర్మాసనం నిలదీసింది. పాక్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో నరమేధం సాగించారని, అమాయకులైన భారతీయ పౌరులను పొట్టన పెట్టుకున్నారని, ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు అయింది. ఉర్వశి జైన్ ఆధ్వర్యంలో నలుగురు లా విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణకు అప్పీల్ చేశారు. మ్యాచ్ ప్రజల సెంటిమెంట్‌కు, జాతీయ భావనకు విరుద్ధం అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిజానికి అయితే ఎటువంటి క్రీడ అయినా సంబంధిత జట్లు ప్రాతినిధ్యం వహించే దేశాల మధ్య సామరస్యానికి, మైత్రికి దారితీయాల్సి ఉంటుంది.

అయితే పహల్గామ్ దాడి తరువాతి ఆపరేషన్ సిందూర్‌తో పరిస్థితి ఇందుకు అతీతంగా మారింది. మన పౌరుల ప్రాణాలు పొయ్యాయి. మన జవాన్లు ప్రాణాలకు తెగించి సాహస చర్యకు దిగారు. ఈ దశలో ఇరుదేశాల మధ్య క్రికెట్ ఏ ఉద్వేగాలతో సాగుతుందని పిటిషన్‌లో ప్రశ్నించారు. మ్యాచ్ జరిగితే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు పోయిన పహల్గామ్ బాధిత కుటుంబాలు తల్లడిల్లుతాయని, మ్యాచ్‌ను ఎవరూ జీర్ణించుకోలేకపోతారని తెలిపారు. సయ్యాటకు దిగే పక్షంతో క్రికెట్ ఆట అనుచితం అవుతుందన్నారు. మన భారతీయ సైనిక దళాలు, మొత్తం మీద దేశ ప్రజల స్థయిర్యాన్ని కించపరుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News