Tuesday, July 29, 2025

తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యార్థుల ప్రయోజనా లు కాపాడేలా, స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా సుప్రీంకోర్టులో వాదనల కోసం అవసరమైతే సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జ నరల్ సుదర్శన్‌రెడ్డికి సూచించారు. ఎంబిబిఎస్ సీట్ల స్థానికతపై రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక తీర్పు నేపథ్యంలో మెడికల్ కౌన్సిలింగ్ కు సంబంధించిన స్థానికత అంశంపై సోమవారం సాయంత్రం ఎజి సుదర్శన్ రెడ్డితో మంత్రి రాజనర్సింహ, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు చర్చించారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా,

స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా గతేడాది ప్రభుత్వం జిఒ 33 తీసుకు వచ్చిందని, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా కోర్టులో వాదనలు వినిపించాలని ఎజికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ స్థానిక కోటాలో తమకు కూడా సీట్లు ఇవ్వాలని ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా, కౌన్సెలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు తాత్కాలిక తీర్పు వెలువరించింది. ఈ అం శంపై ఆగస్టు 5వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలోనే ఎజిని కలిసి, స్థానిక విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని మంత్రి కోరారు.

హైకోర్టు తాత్కాలిక తీర్పు
రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్ల స్థానికతపై రాష్ట్ర హైకోర్టు కీలక తాత్కాలిక తీర్పును ఇచ్చింది. కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మెడికల్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చే సుకుని హైకోర్టును ఆశ్రయించిన సుమారు 100 మంది దరఖాస్తుదారులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించి, ప్రవేశ ప్రక్రియలో నమోదు చేసుకోవడానికి అనుమతించాలని ఆదేశించింది. తుది తీర్పు వెలువడే వరకు మెడికల్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌లో వారిని చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీతో రిజిస్ట్రేషన్ గడువు ముగియనుండటంతో హైకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. ఎంబిబిఎస్ ప్రవేశాలకు ముందు 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివితేనే స్థానికులుగా పరిగణిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

కాగా, ఇటీవల సుప్రీం కోర్టు గత సంవత్సరం తరహాలోనే తహసీల్దార్(ఎంఆర్‌ఒ) ఇచ్చే నివాస ధృవపత్రాన్ని ఎంబిబిఎస్ ప్రవేశాలకు స్థానికులుగా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కాళోజీ వర్సిటీ ఈ నెల 15న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి.శామ్ కోషీల ద్విసభ్య బెంచ్ విచారిస్తోంది. ఈ అంశంపై సోమవారం హైకోర్టు విచారణ జరుగగా, పిటిషన్ల తరపున న్యాయవాది అల్లూరి దివాకర్ రెడ్డి వాదిస్తూ జూలై 30తో రిజిస్ట్రేషన్ గడువు ముగియనుందని, పిటిషనర్లను స్థానికులుగా పరిగణించకపోతే కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్‌లో పాల్గొనలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పిటిషనర్లను స్థానికులుగా పరిగణించి రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News