Thursday, May 8, 2025

ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ‘సుప్రీం’లో చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. కానీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పుతో సంబంధం లేకుండా శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సిబిఐ వాదనలు విని పించింది. సిబిఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంత పురం జిల్లా ఓబుళాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఎఎస్ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు.

అయితే ఈ కేసులో శ్రీలక్ష్మిపై నమోదు అయిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. 2022లో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ కేసులో ఒక్క శ్రీలక్ష్మి విషయంలోనే నేరం చేశారా లేదా అన్నది విచారణ జరిపి ఆమె నేర ప్రమేయంపై సాక్ష్యాలు ఉంటే దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేస్తారు. గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా శ్రీలక్ష్మి ఉన్నారు. లీజుల్లో అవకతవకలు దగ్గర నుంచి గాలి జనార్ధన్ రెడ్డి కి అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టడం వరకూ చాలా తప్పులు ఆమె చేతులు మీదుగా జరిగాయని సిబిఐ కేసులు పెట్టింది. గాలి జనార్ధన్ రెడ్డి నుంచి ఆర్థిక ప్రయోజ నాలు కూడా పొందినట్లుగా ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News