న్యూఢిల్లీ: గవర్నర్ల వంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి విధులను నిర్వర్తించడంలో విఫలమైతే, రాజ్యాంగ సంరక్షకురాలిగా పిలుచుకునే సుప్రీంకోర్టు పనిలేకుండా కూర్చోగలదా అని రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిల్లుల ఆమోదానికి గడువు వివాదంపై రాష్ట్రపతి సూచనపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. పది రోజులపాటు మారథాన్ మాదిరిగా సాగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవా య్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, గోపాల్ సుబ్రమణియం, అరవింద్ దాతార్ పలువురు న్యాయ నిపుణులను విచారించింది. వాదనలు ప్రధానంగా రాజ్యాంగం ఆర్టికల్ 200, 201 చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. రాష్ట్రపతి సూచ న, గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాజ్యాంగ న్యాయస్థానం గడువులను నిర్దేశించగలదా అనే కీలక అంశంపైనే ఈ వాదనలు సాగాయి.
చివరి రోజున రాజ్యాంగంలోని మౌలిక వ్యవస్థలో ఒకటి అయిన అధికారాల విభజనను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించారు. కోర్టు కాలక్రమాలను నిర్ణయించకూడదని, గవర్నర్ల విచక్షణాధికారాలను జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పిఎస్. నరసింహ, ఎఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం జోక్యం చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మాట్లాడుతూ.. రాజ్యాం గ సంరక్షకుడిగా ఎవరెంత ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్నా.. తాను అధికార విభజన సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానని, న్యాయపరంగా క్రి యాశీలతో ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, న్యాయపరమైన ఉగ్రవాదం ఉండకూడదని తాను బహిరంగా చెబుతానన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలోని ఒక విభాగం తన విధిని నిర్వర్తించడంలో విఫలమైతే, రాజ్యాంగ సంరక్షకుడు శక్తిహీనుడై పనిలేకుండా, నోరు మూసుకు ని కూర్చుంటాడా అని ప్రశ్నించారు. తుషార్ మెహతా మాట్లాడుతూ.. కోర్టులే కాదు. కార్యనిర్వాహకుడిగా ఉన్న ప్రభుత్వం కూడా పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షకుడే. అలాగే శాసనసభ కూడా. మూడు వ్యవస్థలూ రాజ్యాంగ సంరక్షకులే అని వివరించారు.
రాజ్యాంగ కార్యనిర్వాహకుడి శాసనసభ విధులకు సంబంధించి, గవర్నర్‌కు ఒక వ్యక్తి ప్రజావిధి నిర్వర్తించమని కోరు తూ రిట్ వేయడం లేదా, మాండమస్ జారీ చేయ డం, అధికారాల విభజన సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తుందని, అధికార విభజన మౌలిక నిర్మాణంలో ఓ భాగం అని సొలిసిటర్ జనరల్ వివరించారు. గవర్నర్లు నిరంతరం బిల్లులను ఆపలేరని, అంతమాత్రాన వారికి ఆర్టికల్ 200 కింద విచక్షణాధికారాలు లేవని అర్థం కాదని తుషార్ మెహతా అన్నారు. ఆర్టికల్ 200లో ఉపయోగించిన సా ధ్యమైనంత త్వరగా అనే పదానికి నిరవధికంగా అని అర్థం లేదని అన్నారు. 1971 నుంచి రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులలో 90శాతం నెలలోపే గవర్నర్ ఆమోదం పొందాయని ఆయ న పునరుద్ఘాటించారు అయితే మొత్తం 17,150 బిల్లులలో 20 సందర్భాలలోనే గవర్నర్లు ఆమోదాన్ని నిలిపివేశారని పేర్కొన్నారు.