Sunday, September 14, 2025

వక్ఫ్ చట్టం సవరణలపై రేపు సుప్రీం రూలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టం 2025 పై సుప్రీంకోర్టు సోమవారం తమ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుంది. ఈ చట్టం సవరణలను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటి విచారణ ముగిసింది. చట్ట సవరణలో మూడు ప్రధాన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కోర్టుల ద్వారా వినియోగదారుల ద్వారా, ఒప్పందాల ద్వారా సంతరించుకున్న ఆస్తుల డినోటిఫై వంటి కీలక విషయాలపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు మధ్యంతర రీతిలో వెలువడుతుంది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలపై తమ నిర్ణయాన్ని మే 22వ తేదీన రిజర్వ్ చేసి ఉంచింది వక్ఫ్ చట్టం ద్వారా కొన్ని ప్రాంతాలలో భూములు, ఆస్తుల సమీకరణలు వివాదాస్పదం అయ్యాయి. ఇది సుప్రీంకోర్టు విచారణ దాకా వెళ్లాయి. సోమవారం సుప్రీంకోర్టు వెలువరించే కీలక తీర్పులతో కూడిన జాబితాను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

వక్ఫ్ భూముల డినోటిఫై అంశంపై ప్రధానంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు వెలువడుతాయి. చట్టం సవరణలను సవాలు చేసిన వారి తరఫు న్యాయవాదులు, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలను మూడు రోజుల పాటు ధర్మాసనం విన్న తరువాత తీర్పును రిజర్వ్ చేశారు. రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలోకి సభ్యులను తీసుకోవడం, నిర్మాణ స్వరూపంపై కూడా విచారణ జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యులు మినహాయిస్తే కేవలం ముస్లింలే బోర్డులను నిర్వహించాల్సి ఉంటుందని బలీయ వాదనలు తలెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News