Wednesday, July 16, 2025

ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష

- Advertisement -
- Advertisement -

నీట్ పీజీ 25 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న రెండు విడతల్లో నిర్వహించి, జులై 15 న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ( ఎన్‌ఈబీ) ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్‌ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది.

అందుకే దానిని ఒకే విడతలో నిర్వహించేలా బోర్డ్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీం లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు ,సమయం సరిపోదంటూ ఎన్‌ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News