Saturday, July 26, 2025

7/11 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు తీర్పుపై స్టే

- Advertisement -
- Advertisement -

2006 ముంబై రైలు బాంబు పేలుళ్ల కేసు 7/11 ఉదంతంలో సుప్రీంకోర్టు స్పందించింది. 12 మంది నిర్దోషులు అంటూ బొంబాయి హైకోర్టు వెలువరించిన తీర్పుపై గురువారం స్టే విధించింది. అయితే వీరు తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బొంబాయి హైకోర్టు తీర్పును ఓ సంవిధానంగా భావించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.

హైకోర్టు తీర్పుతో విడుదల అయిన వీరు బయటనే ఉండవచ్చునని ధర్మాసనం పేర్కొంది. వీరి నిర్దోషిత్వాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. నిందితులు తమ సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించింది. వారికి నోటీసులు వెలువరించారు. దోషులని పేర్కొనబడ్డ వారు నిర్దోషులు అయ్యారని , ఈ దశలో చట్ట వ్యవహారాల గురించి సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తిపై స్పందించారు. ఈ విషయంలో ముంబై హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తున్నట్లు , ఇది పరిగణనలోకి రాదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News