Tuesday, September 16, 2025

జూలై 1 వరకు సూరజ్‌కు సిఐడి కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఒక పురుషునిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జెడి (ఎస్) ఎంఎల్‌సి సూరజ్ రేవణ్ణను బెంగళూరులో ఒక న్యాయస్థానం జూలై 1 వరకు సిఐడి కస్టడీకి సోమవారం పంపింది. సిఐడి ఆదివారం సూరజ్ రేవణ్ణను 42వ అదనపుచీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు (ఎసిఎంఎం) న్యాయమూర్తి ముందు హాజరు పరచింది. ఆయన సూరజ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. సిఐడి కేసుఫైలు పొందిన తరువాత మరింత దర్యాప్తు నిమిత్తం సూరజ్ కస్టడీని కోరుతూ సోమవారం కోర్టును ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News