Thursday, May 1, 2025

11 ఏళ్ల విద్యార్థితో పారిపోయిన పంతులమ్మ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: విద్యార్థితో కలిసి ఓ లేడీ టీచర్ పారిపోయింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్లి విద్యార్థి ట్యూషన్‌కు వెళ్లేవాడు. అక్కడ ట్యూషన్ టీచర్(23) సదరు విద్యార్థితో చనువుగా ఉండేది. గత మూడు సంవత్సరాల నుంచి ఒకే ప్రాంతంలో ఉండడంతో రెండు కుటుంబాల మధ్య పరిచయాలు ఉన్నాయి. బాలుడితో టీచర్ పారిపోయింది. విద్యార్థి తండ్రి తన కుమారుడు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సిసి టివి కెమెరాలు గమనించగా ఇద్దరు లేడీ టీచర్‌తో బాలుడు వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. నాలుగు రాష్ట్రాలలో తిరిగిన రాజస్థాన్ సరిహద్దులోని ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ఇళ్లలో కుటుంబ సభ్యుల తిట్లు పడలేక ఇద్దరు పారిపోయామని పోలీసులకు వివరణ ఇచ్చారు. బాలుడు వయసు 11 ఏళ్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News