- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఈ ఆదేశాల ను అమలు చేయాలని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సిఎస్‌ను సిఎం రేవంత్ ఆదేశించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నాం సురవరం భౌతికకాయానికి అధికార లాంఛనాలతో గౌరవ సూచకంగా అధికారులు నివాళ్లు అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయయుడు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు.
- Advertisement -