- కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం గుప్పిట పట్టుకోవడానికి కుయుక్తులు
- లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకమై తిప్పికొట్టాలి
- సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: అధికారం కన్నా విపక్షంగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాటాలకు కమ్యూనిస్టులు ఆసక్తి కనబరుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొన్నటి అధికార బదలాయింపులో కమ్యూనిస్టుల సహాకారం ఎంతో ఉందని ఆయనన్నారు. శనివారం రవీంధ్రభారతిలో సిపిఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేసి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొని రెండు మౌనం పాటించారు. అనంతరం సురవరం సుధాకర్ రెడ్డికి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశనుండి జాతీయ స్థాయికి ఎదిగిన పాలమూరు ముద్దుబిడ్డ సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. తాను నమ్మిన సిద్దాంతాలను తుదిశ్వాస వరకు ఆచరిస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు. పేద ల జీవితాల్లో మార్పు రావాలని వారి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని స మాజంలో అసమానతలు, అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు చేపట్టారన్నారు.
మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వంటి వారు పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చారని, రెండోతరంలో జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డి రాజకీయాల్లో రాణించి విలువలను పెంపొందించారని కొనియాడరు. సుధాకర్‌రెడ్డి శాశ్వతం గా గుర్తుండి పోయేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. కేంద్రంలోని ప్రభు త్వం వన్ నేషన్, వన్ ఎ లక్షన్ పేరుతో అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తోందని విమర్శించా రు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఉపరాష్ట్రపతి అభ్యర్తిగా నెలిబెట్టినట్లు తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పాటు కమ్యూనిస్టులు బలపడాలని అన్నారు. సు రవరం సుధాకర్ రెడ్డి జీవనశైలి ఎల్లప్పుడు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలతో జాతీయ స్థాయికి ఎదిగిన సువరం సుధాకర్‌రెడ్డి కార్మిక సమస్యలపై, ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప కమ్యూనిస్టు అని నివాళులర్పించారు.
సిపిఎం పో లిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి వ్యక్తిత్వం, పనిపద్దతి, నడక తీరు తనతో పాటు అనేక మందిపై చెరగని ముద్ర వేసిందన్నారు. ఆయన ఉదార వ్యక్తిత్వం, హుందాతనం క మ్యూనిస్టు ఉద్యమాలకు స్పూర్తి అని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మా ట్లాడుతూ- మార్క్ సూచించిన నూతన సమాజ నిర్మాణం కోసం సుధాకర్ రెడ్డి కృషి చేశారన్నారు. బిఆర్‌ఎస్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ సురవరం సుధాకర్‌రెడ్డి ప్రభావం వ్యక్తిగతంగా తనపై ఎక్కువగా ఉందన్నారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కార్యదర్శి కె. నారాయణ, సిపిఐ నేత, సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంఎల్‌ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి, సామ్యూల్, ఎంపి ఈటల రా జేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తదితరు లు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి సురవరం సుధాకర్ రెడ్డిపై రూపొందించిన పాటల సీడీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.