Sunday, August 31, 2025

టి-20ల్లో అతడే నెం.1.. మనోళ్లిదరూ అతడి తర్వాతే: సురేష్‌ రైనా

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్-2025 మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. యుఎఇ వేదికగా ఈ సారి టి-20 ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్2లో టీం ఇండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు భారత్‌దే కప్పు అని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన దృష్టిలో టి-20ల్లో ఎవరు నెం.1 అనే విషయాన్ని సురేష్ రైనా (Suresh Raina) వెల్లడించారు. తన వరకూ సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెస్ టి-20ల్లో టాప్ అని రైనా అన్నారు.

ఆ తర్వాత రెండు స్థానాల్లో టీం ఇండియా టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలకు చోటు కల్పించారు. ‘‘వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీ బాదాడు. సూర్యకుమార్ మైదానం నలువైపులా షాట్స్ ఆడగలడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు అత్యంత డేంజరస్ ప్లేయర్లలో ఒకడు. సిక్సులను అలవోకగా కొట్టడం అతడి ప్రత్యేకత. గత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరిందంటే అందుకు కారణం అతడే. అలాగే ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున కూడా అతను కీలక ఇన్నింగ్స్ ఆడాడు’’ అని సురేష్ రైనా (Suresh Raina) తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Also Read : యాదాద్రి యోధాస్ ఘన విజయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News