Saturday, June 21, 2025

సూర్య 45 ‘కరుప్పు’

- Advertisement -
- Advertisement -

సూర్య తన మాగ్నమోపస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సూర్య 45’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘కరుప్పు’ అని టైటిల్ పెట్టారు. దర్శకుడు ఆర్జే బాలాజీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం టైటిల్ లుక్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సూర్య చేతిలో కత్తి పట్టుకుని, అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా ఫెరోషియష్ అవతార్‌లో కనిపించారు.

సినిమా యాక్షన్‌తో నిండి ఉంటుందని, సూర్య వైల్డ్ పాత్రలో కనిపిస్తాడని పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష కృష్ణన్ తిరిగి ఈ చిత్రంలో జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి, స్వాసిక, అనఘ మాయ రవి, శివద, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ కరుప్పు కి మ్యూజిక్ అందిస్తున్నారు. చిన్న ప్యాచ్‌వర్క్ మినహా షూట్ మొత్తం పూర్తయింది. అదే సమయంలో టీం పోస్ట్- ప్రొడక్షన్‌పై కూడా పని చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News