Thursday, July 3, 2025

థాయిలాండ్ తాత్కాలిక ప్రధానిగా సూర్య జుంగ్రుంగ్రియాంగ్కిట్

- Advertisement -
- Advertisement -

థాయిలాండ్ దేశ తాత్కాలిక ప్రధానిగా ఉప ప్రధాని సూర్య జుంగ్రుంగ్రియాంగ్కిట్ బాధ్యతలు స్వీకరించారు.24 గంటలపాటు ఆయన ప్రధాని పదవిలో ఉంటారు.కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భర్తీ చేయబడే ముందు ఆయన 24 గంటల పాటు పదవిలో ఉంటారని ఎఎఫ్ పి వార్తా సంస్థ వెల్లడించింది. థాయిలాండ్ రాజకీయాల్లో పెనుమార్పుల కారణంగా ఈ నిర్ణయం జరిగింది. థాయిలాండ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రాను మంగళవారం రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్ చేసిన తర్వాత సూర్య జుంగ్రుంగ్రియాంగ్కిట్ కు పదవి చేపట్టే ఛాన్స్ వచ్చింది.కంబోడియాతో జరిగిన దౌత్య వివాదంలో మాజీ ప్రధాని థాక్సిన్ షినవత్రా కుమార్తె పెటోంగ్టార్న్ పినవత్రా కేబినెట్ నీతి నియమాలను ఉల్లంఘించిందని కోర్టు భావించింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాలను పొరుగుదేశం కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ తో ఆమె చర్చించడంతో దేశవ్యాప్తంగా రాజకీయదుమారం చెలరేగింది.

పెటోంగ్టార్న్ కంబోడీయా మాజీ నాయకుడు హున్ సేన్ ను మామ అని, థాయిలాండ్ మిలిటరీ కమాండర్ ను ప్రత్యర్థి అని అభివర్ణించినట్లు ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వివాదం ముదిరింది. మే నెలలో సరిహద్దు ప్రతిష్టంభన సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. థాయ్ మిలిటరీని అణగుదొక్కుతున్నారనే ఆరోపణలకు దారితీశాయి.పెటోంగ్టార్న్ పినవత్ర సస్పెన్షన్ తో అమెకుటుంబం రాజవంశంతో ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలకు మరింత తోడు అయింది. ఆమె తండ్రి థాక్సిన్ పినవత్రా ప్రస్తుతం కోర్టులో రాజ పరువునష్టం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.ఒకరోజు ప్రధాని పదవి చేపట్టిన సూర్య జుంగ్రుంగ్రియాంగ్కిట్ ఇప్పటివరకూ థాయిలాండ్ రవాణా శాఖమంతిగా, డిప్యూటీ ప్రధానిగా ఉన్నారు. కేబినెట్ పనర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలైంది. గురువారం కొత్త అంతర్గత శాఖమంత్రి, ఉప ప్రధానిగా పుంతం వెచాయాచాయ్ ప్రమాణస్వీకారం చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News