- Advertisement -
జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం 19 ఏళ్ల సురూచి సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో సురూచి అసాధారణ ప్రతిభతో అలరించింది. ప్రత్యర్థులతో గట్టి పోటీ ఎదురైనా తట్టుకుంటూ స్వర్ణం దక్కించుకుంది. సురూచి సింగ్ ఫైనల్లో (241.9) స్కోరును సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కమిల్లె (241.7) స్కోరుతో రజతం దక్కించుకుంది. చైనాకు చెందిన జియాన్ జున్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. కాగా, భారత స్టార్ షూటర్ మను బాకర్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఫైనల్లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
- Advertisement -