Saturday, May 24, 2025

రూ. 7000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

- Advertisement -
- Advertisement -

కడెం తహసిల్దార్ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డి.ఎస్.పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేయగా గంగాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అను రైతు వద్దనుండి 7000 ల రూపాయలు మండల సర్వేయర్ ఉమాజీ రైతు వద్ద నుండి లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ తన తండ్రి మరణించినందున తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి నీసర్వే చేసి ప్రొసిడీంగ్ ఇవ్వమని

కోరగా సర్వేయర్ ఉమాజీ 20000 డిమాండ్ చేయగా ఇదివరకే 12 వెలు రూపాయలు సర్వేయర్ కు ముట్టచెప్పగా ప్రొసిడీంగ్ కాపీ ఇవ్వడానికి 7000 ల రూపాయలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని అనడంతో బాధిత రైతు ప్రభాకర్ ఏసీబీ నీ ఆశ్రయించాడని ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణ లో 7000 ప్రభాకర్ నుండి సర్వేయర్ ఉమాజీ తీసుకుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News