- Advertisement -
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం జరిగింది. బైక్ మీద వెళ్తున్న ముగురిని చంపేందుకు కారులో ఐదుగురు వ్యక్తులు వెంబడించారు. సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని కారులో వెంబడించారు. బిబిగూడెం సమీపంలో ఓ వైన్స్ ముందు బైక్ బయటపడవేసి అందోళనతో ముగ్గురు వైన్స్ లోపలికి వెళ్లారు. ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తిన దుండగులు వైన్స్ షాప్ లో ఉన్న వారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి దండగులు పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Advertisement -