Friday, September 12, 2025

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ: సోషల్‌మీడియా బ్యాన్, అవినీతి పాలన తదితర కారణాలతో నేపాల్ భగ్గుమన్న విషయం తెలిసిందే. జెన్‌-జెడ్ యువత ఆందోళనలతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కెపి శర్మ ఓలీ.. నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ రద్దైంది. తర్వాత ప్రధానిగా మాజీ చీఫ్‌ జస్టిస్ సుశీల కర్కీని (Sushila Karki) తాత్కాలిక ప్రధానిగా ఉద్యమకారులు ఎన్నుకున్నారు. సుశీల కర్కీ(72) తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత న్యాయవ్యవస్థలో అడుగుపెట్టారు.

నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ.. అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీం కోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు పూర్తిస్థాయిగా చీఫ్ జస్టిస్ బాధ్యతలు చేపట్టారు. దీంతో నేపాల్ తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సాధించారు. తాజాగా జరిగిన ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. మరికాసేపట్లో సుశీల కర్కీ (Sushila Karki) ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also Read : నేపాల్ సారథి సుశీల కర్కీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News