ఖాట్మాండూ : పొరుగుదేశం నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సుశీలా కర్కి శుక్రవారం రా త్రి ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్‌కు ఆమె తొలి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచారు. నే పాల్ ప్రస్తుత పార్లమెంట్‌ను రద్దు చేసిన ప్రకటన తరువాత రాత్రి 9.30 గంటలకు సుశీలా కర్కి ప్రమాణస్వీకారం జరిగింది. జెడ్ జన్ యువత ఉవ్వెత్తు నిరసనల తరువాత నెలకొన్న అత్యంత సంక్లిష్ట, సంక్షుభిత దశలో దేశ సారధ్య బాధ్యతలు స్వీకరించిన ఆమె దేశంలో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత లు నిర్వర్తించారు. న్యాయ వితరణలో ముక్కు సూటితనం ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఖాట్మాండూలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన హ డావిడి కార్యక్రమంలో సుశీలా కర్కి దేశ తా త్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పలు ఊహాగానాలు, హైటెక్ స్థాయిలో ఉద్యమకారులు నిర్వహించిన ఇంట ర్నెట్, సామాజిక మాధ్యమాల అధ్యయనం తరువాత అభిప్రాయసేకరణ తరువాత సుశీలా పేరు ఈ పదవికి ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా ఖరారు అయింది.
Also Read: జిఎస్టి ఎగవేతదారులపై కొరడా
ప్రమాణస్వీకార కా ర్యక్రమంలో దేశాధ్యక్షులు రామచంద్ర పౌడెల్, ఉపాధ్యక్షులు రామ్ సహాయ్ యాదవ్ , ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ మాన్ సింగ్ రావత్ ఇతరులు హాజరయ్యారు. తాత్కాలిక ప్రధానిగా సుశీలా ఎంపికను లాంఛనంగా దేశాధ్యక్షుడి కార్యాలయంలో ప్రకటించారు. అధ్యక్షులు రామ్ చరణ్ పౌడెల్, నేపాల్ సైనిక దళాల ప్ర ధానాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ , జడ్ జ న్ ఉద్యమకర్తల ప్రతినిధుల మధ్య జరిగిన చ ర్చల దశలో ఆమె పేరును అధికారికంగా ప్రక టించారు. ఈ వారంలోనే దేశ ప్రధాని కెపి శర్మ ఓలి పదవికి రాజీనామా చేశారు. సుశీలా కర్కి తో పాటు ప్రధాని పదవికి బాలేంద్ర షా పేరు కూడా ఓ దశలో ప్రముఖంగా విన్పించింది. 35 సంవత్సరాల బాలేంద్ర ఖాట్మాండు మేయర్, ర్యాపర్, రాజకీయ నాయకుడు, పట్టణ యువ తరంలో గట్టి పట్టుంది. అయితే అత్యధిక మెజా ర్టీ దశలో సుశీలా పేరును ప్రధాని పదవికి ఖరా రు చేశారు. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీక రించిన వెంటనే సుశీలా కర్కి అత్యవసర రీతిలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. పరి స్థితిని చక్కదిద్దేందుకు దేశంలో అత్యయిక పరి స్థితి విధించే విషయం కూడా చర్చకు వచ్చినట్లు, అయితే జెడ్ జన్ ఉద్యమకారుల అభ్యంతరాల మేరకు దీనిని వాయిదా వేసినట్లు వెల్లడైంది.