- Advertisement -
మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కృష్ణ వంశీ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన చిత్రం ‘థాంక్యూ డియర్’.(Thank you, dear) ఈ చిత్రంలో ధనుష్ రఘుముద్రి హీరోగా, హెబ్బా పటేల్, రేఖ నిరోషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ ఈ సినిమాను ప్రపంచంలోని ఓ బర్నింగ్ పాయింట్‌ను తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కలిపి ఫ్యామిలీ అంతా చూసే విధంగా తెరకెక్కించామని అన్నారు. నిర్మాత బాలాజీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో హీరో ధనుష్ రఘుముద్రి, హీరోయిన్ రేఖ నిరోషా, పునీత్, సుభాష్ పాల్గొన్నారు.
- Advertisement -