ఖమ్మం రూ రల్ మండలం గొల్లగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్యా ప్రతిమ(10) సోమవారం తరగతి గదిలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిం ది. తరగతి గదిలో పరీక్ష రాస్తుండగా ఫీట్స్ వచ్చి పడిపోయింది. వెంటనే విద్యార్థినిని ఖమ్మం ప్ర భుత్వాసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెం దినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే తరగతి గదిలో సృ్పహ తప్పి పడిపోయిందని టీ చర్లు చెబుతుండగా విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. తమ కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థిని తల్లిదండ్రులు చెబుతున్నా రు. దీంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముం దు మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని మృతికి కారకులైనా పాఠశాల వార్డెన్ రమాదేవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో పోలీసులకు,
విద్యార్థి సంఘ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోగా విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికల రామకృష్ణ, పిడిఎస్‌యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తూడుం ప్రవీణ్, పిడిఎస్‌యు (ఎన్డీ) జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ జార్జ్‌రెడ్డి పిడిఎస్‌యు ప్రధాన కార్యదర్శి మందా సురేష్‌లు మాట్లాడుతూ తక్షణమే చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50లక్షల రూపాయల ఎ క్స్‌గ్రేషియా, వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభు త్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న ట్రైబల్ జిల్లా అధికారి విజయలక్ష్మి ప్రిన్సిపాల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన వామపక్ష విద్యార్థి. సంఘాల నాయకులను అరెస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు .