Friday, August 15, 2025

టిడిపి పోలింగ్ బూత్ లకు రాకుండా ఓటర్లను భయపెట్టారు: సతీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్ఆర్ సిపి నేతలే టార్గెట్ గా టిడిపి గూండాలు దాడులు చేశారని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి (SV Satish Reddy) తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్టలో రిగ్గింగ్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం  హైదరాబాద్ సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. మారణాయుధాలతో చాలా మందిని గాయపరిచారని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి చేశారని మండిపడ్డారు. కారుపై పెట్రోల్ పోసి చంపడానికి యత్నించారని, ఇప్పటికే వేల్పుల రాము ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని సతీష్ రెడ్డి విమర్శించారు.

తిరిగి తమ వాళ్లపైనే ఎస్ సి, ఎస్ టి  కేసు పెట్టారని, అర్థరాత్రి అవినాష్ రెడ్డి ను అరెస్టు చేసి వందల కి.మి లు తిప్పారని ధ్వజమెత్తారు. తనను కూడా అక్రమంగా నిర్భంధించారని, (Illegally detained) చిన్న ఉపఎన్నిల కోసం 700 మంది పోలీసులను పెట్టారని అన్నారు. 3 వేల మందికి పైగా టిడిపి గూండాలను రప్పించారని, టిడిపి గూండాల అరాచకాలకు పోలీసులు కొమ్ముకాశారని ఎద్దేవా చేశారు. పోలింగ్ బూత్ లకు ఓటర్లను రాకుండా భయపెట్టారని, వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారని, పోలింగ్ బూతుల్లోకి మీడియాను సైతం అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి ఏజెంట్లను లేకుండా చేసి విచ్చల విడిగా రిగ్గింగ్ చేశారని, ఎపి సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సతీష్ రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News