Wednesday, June 4, 2025

క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంటులో టైటిల్ ఫేవరేట్లలో ఒకరైన ఇగా స్వియాటెక్ క్వార్టర్ (Sviatek Quarter) ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే మూడు సార్లు ఫ్రెంచ్ టైటిల్ విజేత అయిన స్వియాటెక్ ఈ సారి కూడా టైటిల్‌ను దక్కించుకుని రికార్డు సృష్టించాలనుకుంటోంది. అయితే ఆదివారం ఎలెనారిబాకినాతో జరిగిన పోరులో విజయం అంత సులంగాలభించలేదు. తొలిసెట్‌ను 1 6తో చేజార్చుకుని రెండో సెట్‌లో కూడా సర్వీస్ బ్రేక్‌తో వెనుకబడి ఉన్న స్వియాటెక్ ఆ తర్వాత పుంజుకుని రెండో సెట్‌ను 6 3తేడాతో దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లో ఒక దశలో 45గేమ్‌లతో వెనుకబడి ఓటమి ఖాయమని అనుకొంటున్న సమయంలో అనూహ్యంగా పుంజుకొని 7 5తేడాతో ఆ సెట్‌ను దక్కించుకుని క్వార్టర్ ఫైనల్‌కు (quarter-finals) దూసుకెళ్లింది.

క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్విట్లోనాను ఎదుర్కోనుంది. ప్రీక్వార్టర్ ఫైనల్లో స్విట్లోనా నిరుటి రన్నరప్ జాస్మిన్ పొలోనీని ఊహించని రీతిలో 46 76,(86), 61తేడాతో ఓడించిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మ్యాచ్‌లో విజయం సాధించడాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ స్విట్లోనా వ్యాఖ్యానించిందంటే మ్యాచ్ ఎంత హోరాహోరీగా సాగిందో అర్థమవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News