భోపాల్: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మధ్య ప్రదేశ్ లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరమని, ఈ పథకం మధ్యప్రదేశ్‌లోని వివిధ వర్గాలకు చాలా ఉపయోగమని, ఈ పథకం వల్ల చేనేత కార్మికులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. పిఎం మిత్ర పార్కుతో రైతులూ పలు విధాలుగా ప్రయోజనం పొందుతున్నారని, ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని మోడీ వివరించారు.
Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?
మహిళ సాధికారత కోసమే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం తీసుకొచ్చామన్నారు. ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మహిళలను రక్షించాలన్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని, సర్దార్ వల్లబాయ్ పటేల్ ఎంతో ధైర్యసాహసాలు చూపించి దేశంలో విలీనం చేశారన్నారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నామని, దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని మోడీ కొనియాడారు.