Saturday, May 24, 2025

మైసూర్‌పాక్‌లో ‘పాక్’ ఉందని ఆ వ్యాపారి ఏం చేశారంటే..

- Advertisement -
- Advertisement -

జైపూర్: పహ‌ల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత యావత్ భారతదేశమంతా పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతోంది. ఆ దేశానికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేయడంతో ఈ ఆగ్రహం కాస్త చల్లారినప్పటికీ.. ఇంకా పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు పాకిస్థాన్‌పై తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ‘త్యోహార్ స్వీట్స్’ (Sweet) దుకాణం వ్యాపారి పాకిస్థాన్‌పై తన కోపాన్ని తనదైన రీతిలో చూపించారు. మైసుర్‌పాక్‌లో (Mysore pak) పాక్ ఉండటంతో ఆ పదాన్ని తొలగించి స్వీట్ పేరును ‘మైసూరు శ్రీ’ అని మార్చేశారు.

దుకాణ యజమాని (Sweet) అంజలీ జైన్ ఈ వినూత్న ఆలోచన చేశారు. మైసూర్‌పాక్‌తో (Mysore pak) పాటు తమ దుకాణంలో ఉండే మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్‌లను కూడా మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్ శ్రీగా మార్చేశారు. స్వర్ణ భాషం పాక్‌, చాందీ భాషమ్‌ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా అంజలీ మాట్లాడుతూ.. సరిహద్దులోనే దేశభక్త ఉంటే సరిపోదు అని.. ప్రతీ భారతీయుడికి దేశంపై ప్రేమ ఉండాలని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాస్తవానికి ‘పాక్’ అంటే సంస్కృతంలో ‘పండటం’ అని అర్థం. చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థాన్ని కొన్ని భాషల్లో ‘పాకం’ అంటారు. దీనికి పాకిస్థాన్‌తో సంబంధం లేనప్పటికీ.. పలికే శబ్ధం ఆ దేశాన్ని గుర్తు తెచ్చేలా ఉంటడంతో పేరు మార్చామని.. ‘శ్రీ’ అనే పదం శుభాన్ని సూచిస్తుందని అంజలీ జైన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News