Thursday, July 31, 2025

బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

- Advertisement -
- Advertisement -

ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మెదడు చుట్టు ఉన్న కణాలు వేగంగా పెరగడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. అందుకే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. బ్రెయిన్ ట్యూమర్ సాధారణంగా వృద్యాపంలో వస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే అది మరణానికి కారణం అవుతుంది. అయితే బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

1. నిరంతరం తలనొప్పి ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే తీవ్రంగా తలనొప్పి వస్తుంది.
2. కంటి చూపు మందగిస్తుంది.
3. అలసటగా అనిపించవచ్చు.
4. శరీరంపై నియంత్రణ కోల్పోవడం.
5. మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుంది
6. చూడటం, వినడం లో ఇబ్బంది ఉంటుంది
7. కారణం లేకుండా వికారం లేదా వాంతులు అవ్వడం .
8. జ్ఞాపకశక్తి కోల్పోవడం.
9. నడకలో సమతుల్యత కోల్పోవడం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News