Thursday, September 18, 2025

టి20 ర్యాంకింగ్స్‌లో మనోళ్ల హవా

- Advertisement -
- Advertisement -

వరుణ్ చక్రవర్తి, అభిషేక్, హార్ధిక్‌లకు అగ్రస్థానం
టాప్ ర్యాంక్‌లన్నీ టీమిండియావే

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా కొనసాగుతోంది. టీమ్ ర్యాంకింగ్స్‌తో సహా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగంలో భారత్ టాప్ ర్యాంక్‌లను దక్కించుకుంది. బుధవారం ఐసిసి ప్రకటించిన టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆసియాకప్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో కూడా మెరుగైన ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తి తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి 733 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?

ఆసియాకప్‌లో నాణ్యమైన ప్రదర్శన చేసిన వరుణ్ మూడు ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. జాకబ్ డఫీ రెండో, అకీల్ హుసేన్ మూడో, ఆడమ్ జంపా నాలుగో, ఆదిల్ రషీద్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు ర్యాంకులు కోల్పోయి 8వ స్థానంలో నిలిచాడు. కాగా, బ్యాటింగ్ విభాగంలో భారత యువ సంచలనం అభిషేక్ శర్మ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఆసియాకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ అభిషేక్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో అతని అగ్రస్థానానికి ఢోకా లేకుండా పోయింది. ఆల్‌రౌండర్ విభాగంలో భారత స్టార్ హార్దిక్ పాండ్య టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని కాపాడుకుంది. దీంతో టి20లోని అన్ని టాప్ ర్యాంక్‌లను టీమిండియా దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News