- Advertisement -
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న పిరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు‘. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫోటోలు, టీజర్, సాంగ్స్ మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘తార తార నా కళ్లు’ అంటూ సాగే సిజ్లింగ్ సింగిల్ ను విడుదల చేశారు. ఇందులో నిధి అగర్వాల్ హాట్ లుక్స్ కుర్రకారును పిచ్చెక్కించేలా ఉన్నాయి. నిధి తన అందాలతో సెగలు పుట్టించేలా ఉంది. కాగా, షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 12న పాన్ ఇండియా లెవల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- Advertisement -