- Advertisement -
తాడూరు: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తుమ్మల సుగురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై తల్లి, కొడుకు మృతి చెందారు. సుగురు గ్రామంలో పిండి గిర్ని పనిలో నిమగ్నమై ఉండగా కొడుకు శ్రీకాంత్ (15)కు విద్యుత్ షాక్ తో విలవిలాడుతుండగా తల్లి జయమ్మ (40) రక్షించడానికి ప్రయత్నించింది. ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -