కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లీతో పాటు రోహిత్ కూడా రిటైర్ అవ్వడం జట్టుకు గట్టి దెబ్బే అని చెప్పుకోవాలి. అయితే విరాట్ రిటైర్ అవ్వడంతో అతని స్థానంలో జట్టులోకి ఎవరకు వస్తారనే చర్చ జరుగుతోంది. ఓపెనర్లుగా శుభ్‌మాన్ గిల్, యశస్వీ జైస్వాల్‌లు బరిలోకి దిగుతారనేది స్పష్టమవుతోంది. కానీ, సమస్యల్లా కోహ్లీ బ్యాటింగ్ చేసే నాలుగో స్థానానిదే. ఈ ప్లేస్ ఎవరిని తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీం ఇండియా లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని సూచించారు.
దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి ప్రస్తుతం ఐపిఎల్ ఆడుతున్న కరుణ్ నైర్‌ని జట్టులోకి తీసుకొని అతన్ని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి పంపించాలని కుంబ్లే అన్నారు. దేశవాళీ క్రికెట్‌లో అతను పరుగుల వరద పారించాడని.. పైగా అతను కౌంటీ క్రికెట్‌లో కూడా ఆడాడని.. తద్వారా ఇంగ్లండ్ పరిస్థితులు అతనికి తెలుసని పేర్కొన్నారు. అతని వయస్సు 30 దాటిన ఇంకా యంగ్‌గానే ఉన్నాడని తెలిపారు. అతనికి అవకాశం లభిస్తే యువ ఆటగాళ్లకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలనే ఆసక్తి పెరుగుతోందని కుంబ్లే స్పష్టం చేశారు.