మన తెలంగాణ/తలకొండపల్లి: ఏసీబీ వలలో తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు తన నలుగురు అన్నదమ్ములకు చెందిన భూమిని విరాసత్ చేసేందుకు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లగా అక్కడ రూ.10వేలను డిమాండ్ చేశారన్నారు. లంచం డిమాండ్ చేసిన ఘటనలో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో పక్కా పథకం ప్రకారం రూ.10వేలు లంచం తీసుకున్న అటెండర్ యాదిగిరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తమదైన శైలీలో విచారించగా అటెండర్ తహసీల్దార్ నాగార్జున పేరును చెప్పడంతో అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మహబూబ్‌నగర్‌లోని నాగార్జున నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. తహసీల్దార్ నాగార్జునతోపాటు అటెండర్ యాదగిరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీ వలలో తలకొండపల్లి తహసీల్దార్, అటెండర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -