Monday, May 12, 2025

ఆఫ్ఘనిస్తాన్‌లో చెస్‌ను బ్యాన్ చేసిన తాలిబన్లు.. ఎందుకంటే?

- Advertisement -
- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం చెస్‌ను బ్యాన్ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ గేమ్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆట జూదంతో ముడిపడి ఉండవచ్చనే ఆందోళనలను తాలిబన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం ఇది చట్టవిరుద్ధని.. అందుకే చెస్ గేమ్ ను బ్యాన్ చేస్తున్నామని ఓ క్రీడా అధికారి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని క్రీడా కార్యక్రమాలను నియంత్రించే తాలిబాన్ క్రీడా డైరెక్టరేట్ ఈ చర్య తీసుకుంది. తాలిబాన్లు ఖచ్చితంగా పాటించే షరియా చట్టం ప్రకారం చెస్‌ను జూదంగా పరిగణిస్తున్నామని ప్రభుత్వ క్రీడా శాఖ ప్రతినిధి అటల్ మష్వానీ తెలిపారు.

“షరియాలో చెస్ జూదానికి ఒక సాధనంగా పరిగణించబడుతుంది. గత సంవత్సరం ప్రకటించిన ధర్మ ప్రచారం, దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం ఈ గేమ నిషేధించబడింది. ఈ నిర్ణయం వెనుక మతపరమైన ఆందోళనలు ఉన్నాయి.. వీటిని పరిష్కరించబడే వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో చెస్ నిషేధించబడుతుంది” అని మష్వానీ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News