Thursday, July 24, 2025

తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల పరిధిలోని తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టుకు బుధవారం భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 15 గేట్లు ఎత్తి 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.ఎ గువ ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తింది. తాలిపేరుతో పాటు చింతవాగు, పగిడివాగు, రోటెంత వాగు, రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయానికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్టు నుండి వరద పరవళ్లు తొక్కుతుండడంతో తేగడ వద్ద లోలెవల్ చప్టా నీటమునిగింది. వరద పరిస్థితిని ఏఈ సంపత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News