Friday, May 16, 2025

అప్పటి వరకు.. పాక్ కు నీళ్లు బంద్: జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సింధూ జలాల నిలిపివేతపై యథాతథస్థితి కొనసాగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. భారత్‌-పాక్‌ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్‌పార్టీ జోక్యం అవసరంలేదని ఆయన అన్నారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్నారు. కాల్పుల విరమణ ఎవురు కోరుకున్నారో అందరికి తెలుసన్నారు. భారత్‌ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోందని తెలిపారు. పాక్‌ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని.. టెర్రర్‌ క్యాంప్స్‌ను మూసివేయాల్సిందేనని అయన చెప్పారు.

పాకిస్తాన్‌తో భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఉగ్రవాదంపై చర్చలకే పరిమితం అవుతుందని జై శంకర్ అన్నారు. “పాకిస్తాన్‌తో మా సంబంధాలు, వ్యవహారాలు పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయి. అది సంవత్సరాలుగా జాతీయ ఏకాభిప్రాయం.. దానిలో ఎటువంటి మార్పు లేదు. పాకిస్తాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు” అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News