మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటిస్తూ అదే స్టార్‌డమ్‌ను కొనసాగిస్తోంది. హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కుర్రకారును ఊపేశాయి. వర్క్ విషయంలో ఆమె కమిట్ మెంట్ మాములుగా ఉండదు. ఒప్పుకున్న సినిమా కోసం, యాడ్ కోసం, వెబ్ డ్రామా కోసం ఎన్ని రోజులైనా ప్రమోట్ చేస్తుంది. ఏ ఈవెంట్‌కైనా వెళ్తుంది. అందుకే ఇరవై ఏళ్లుగా ఆమె హీరోయిన్ గా రాణించగలుగుతోంది. తాజాగా ‘డూ యూ వన్నా పార్ట్నర్’ వెబ్ సిరీస్ కోసం తమన్నా చేస్తున్న ప్రమోషన్ అదుర్స్ అనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. అయితే గత 15 రోజులుగా ఆమె ప్రతి రోజూ ఏదో ఒక చోటుకు వెళ్లి ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటోంది. అందుకే ప్రొఫెషనలిజంలో, కమిట్మెంట్లో ఆమె అదుర్స్ అని అంటున్నారు మేకర్స్.
ప్రొఫెషనలిజంలో తమన్నా అదుర్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -