- Advertisement -
న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో మరో తమిళ నటుడు అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల క్రితం నటుడు శ్రీకాంత్ ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు నటులు అరెస్టు కావడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించారు. విచారణలో కీలక సమాచారం సేకరించిన పోలీసులు.. నటుడు కృష్ణను కూడా గురువారం చెన్నైలో అరెస్టు చేశారు. కృష్ణకు కోలీవుడ్ లో పలువురు యువ దర్శకులు, నటులతో పరిచయాలు ఉన్నాయి. టాలీవుడ్ లోనూ కృష్ణకు పలువురితో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నటులు అరెస్టుతో చెన్నై కొకైన్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
- Advertisement -