Sunday, July 6, 2025

శివకాశిలో పేలుడు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం విరుధ్‌నగర్ జిల్లాలో శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ఒకరు మృతి నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను శివకాశిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బాణాసంచా ఫ్యాక్టరీలో పది మంది కూలీలు పని చేస్తున్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.  వారం రోజుల క్రితం శివకాశి ప్రాంతం చిన్న కమాన్‌పట్టి గ్రామ శివారులో బాణసంచా కర్మాగారంలో పేలుడు జరగడంతో ఎనిమిది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News