Tuesday, July 29, 2025

ప్రేమ వ్యవహారం.. 27 ఏళ్ల దళిత యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

తూత్తుకుడి: తమిళనాడులో (Tamilnadu) 27 ఏళ్ల దళిత యువకుడిని దారుణంగా హత్య చేశారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. అతడు కెటిసి నగర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న తన మాజీ స్కూల్ విధ్యార్థిని రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి వివాహానికి అమ్మాయి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. కానీ, కవిన్ మాత్రం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకువాలని పట్టుదలతో ఉండేవాడు.

దీంతో ఆదివారం ఆమెను కలిసేందుకు ఆమె పని చేస్తున్న ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఉన్న అమ్మాయి సోదరుడు సుర్జీత్.. కవిన్‌ని అడ్డుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. కోపం భరించలేకపోయిన సుర్జీత్.. ఆస్పత్రికి 200 మీట్లర దూరంలో కవిన్‌ను కొడవలితో నరికి హత్య చేసి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత పాలయంకొట్టై పోలీసు స్టేషన్‌కి వెళ్లి సుర్జీత్ లొంగిపోయాడు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకోమని కెవిన్ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. సుర్జీత్‌తో పాటు పోలీస్ శాఖలో పని చేస్తున్న అతడి తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. (Tamilnadu)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News