Sunday, July 6, 2025

ఓం శాంతి శాంతి శాంతిః

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. ఇది ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ జాయింట్ ప్రొడక్షన్. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 2డియా నిమేషన్ స్టయిల్‌లో చూపించిన కాన్సెప్ట్ వీడియోతో పాటు ఆకట్టుకునే టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ పోస్టర్ గొడవ పడుతున్న జంట చేతులను చూపించడం ఆసక్తికరంగా వుంది. ’ఓం శాంతి శాంతి శాంతిః ’ (Om Shanti Shanti Shanti) అనే టైటిల్ విజువల్స్‌లో చూపించిన గొడవకు ఫన్ యాడ్ చేసింది. కాన్సెప్ట్ వీడియోలో ఈషాను కొండవీటి ప్ర శాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్‌ను వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా పరిచయం చేశారు. వారి పెళ్లి తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు పందెంకోళ్ల తలపించేట్టుగా చూపించారు. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News