Sunday, September 7, 2025

కారుచౌక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మధ్యతరగతి జీవులకు ఉండే సొంత కారు పగటికల ఈ నెల చివరి నుంచి సాకారం కానుంది. జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయాల ఫలితంగా రూపందిన సరికొత్త జిఎస్‌టి స్వరూపంలో భాగంగా కార్ల తయారీదార్లకు పలు రకాల ఊరట ద క్కింది. దీని వల్ల తమ కంపెనీలకు దక్కే ప్రయోజనాలను కొనుగోలుదార్లకు కూ డా కొంత మేరకు పంచేందుకు ప్రముఖ కార్ల కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ క్ర మంలో ఈ ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్ల ధరలు గణనీయంగా తగ్గిస్తామని ప్రకటించాయి. పండుగ సీజన్‌కు ముందే ఈ భారీ తగ్గిం పు వ్యా పార ప్రకటనలను అన్ని సమాచార మాధ్యమాల ద్వారా విడుదల చేసేందుకు సం స్థలు సిద్ధం అయ్యాయి. ఈ విధంగా తమ బ్రాండ్ కార్ల అమ్మకాలు పెరిగే విధంగా వారు తమ మార్కెటింగ్ టీంను సిద్ధం చేశారు. పండుగకు ముం దు నుంచే ఈ తగ్గింపు జిఎస్‌టి రేట్లకు బుక్ చేసుకోవచ్చునని కంపెనీలు తెలియచేస్తున్నాయి.

తాము జిఎస్‌టి ప్రయోజనాల బదలాయింపు క్రమంలో భాగంగా టయోటా కార్లు ధరను రూ 3.49 లక్షల మేర తగ్గిస్తామని సంబంధిత టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ శనివారం తెలిపింది. ఇక తగ్గింపు ధరల టయోటా కారు కోరుకునే వారికి ఈ నెల 22 నుంచే అందుబాటులోకి వస్తుంది. పారదర్శక, వినయోగదార్ల కేంద్రీకృత కంపెనీ తమది.తమకు వచ్చే లాభం అందరికీ చెందాలనేదే ఆలోచన , మా కస్టమర్లకు జిఎస్‌టి కుదింపు ప్రయోజనాలను చేరుస్తామని టయోటా కిర్లోస్కర్ మోటారు (టికెఎం) వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా ఓ ప్రకటన వెలువరించారు. వివరాల ప్రకారం చూస్తే ఫార్యూనర్ ధర దాదాపు రూ 4 లక్షల వరకూ తగ్గుతుంది. గ్లాంజా ధర రూ 85000, టైసర్ రూ 1.1 లక్ష , రూమియన్ రూ 48700, హై రైడర్ రూ 65400 , క్రిస్టా రూ 1.8 లక్షలు, హై క్రాసు ధర రూ 1.15 లక్షలు, లిజెండర్ ధర రూ 3.34 లక్షలు, హైలక్స్ ధర రూ 2.52 లక్షలు, కామ్రి ధర రూ 1.01 లక్ష, వెల్‌ఫైర్ ధర రూ 2.78 లక్షల మేరకు తగ్గుతుంది. ఈ మేరకు కంపెనీ వర్గాలు శనివారం ప్రకటన వెలువరించారు.

మహీందా కారు ధరలు తక్షణం తగ్గింపు
జిఎస్‌టి రాయితీల దశలో ప్రఖ్యాత కారు బ్రాండు తయారీ ఫ్యాక్టరీ మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరల తగ్గింపును ప్రకటించింది. తమ కారు ధరను తక్షణం రూ 1.56 లక్షల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాల ముగింపు రోజునే ముంబై ప్రధానకేంద్రం ఈ కంపెనీ అధికారిక ప్రకటన వెలువడింది. కారు సవరించిన రేటు వర్తించే అన్ని ఐసిఇ రకాలకు ఈ నెల 6 నుంచే అమలులోకి వస్తుంది. అంటే రేపటి నుంచే సోమవారం నుంచే కొత్త రేటు అమలులోకి వస్తుంది. ఇక బోలోరే , నీయో రేంజ్ ధరలు రూ 1.27 లక్షలు, ఎక్స్‌యువి 3ఎక్స్‌ఒ పెట్రోలు ధర రూ 1.4 లక్షలు, స్కోర్పియో ధర రూ 1.01 లక్షల వరకూ తగ్గుతుందని వివరించారు. స్కోర్పియో ఎన్ ధర రూ 1.45 లక్షల మేర బ్రేక్‌తో వస్తుంది. తార్ రూ 1.33 లక్షలు, మరో బ్రాండ్ ఎక్స్‌యువి 700 ధర రూ 1.43 లక్షల వరకూ తగ్గుతుంది. కొంచెం స్థోమత ఉండి, కారు కొనాలనుకునే తపన చాలా రోజుల నుంచి ఉన్నవారికి ఈ తగ్గింపు పనికిరానుంది.

రూ లక్ష వరకూ రెనాల్ట్ కారు తగ్గింపు ఆఫర్లు
ప్రఖ్యాత రెనాల్ట్ ఇండియా కూడా తమ కార్ల ధరలపై తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 22 నుంచి అమలులోకి వచ్చేలా వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు. తమ కార్లపై మొత్తం మీద రూ 96,395 మేర తగ్గింపు ఉంటుందని కంపెనీ వర్గాలు శనివారం తెలిపాయి. ఇక తగ్గింపు ధరల కార్లకు కొనుగోలు దార్లు తక్షణం బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు కంపెనీకి చెందిన ట్రైబర్, కైగర్ ధరలు కూడా పండుగ సీజన్‌లో తక్కువకు వస్తాయి. క్విడ్ కారు ధర ఎంట్రీస్థాయి లో రూ 55,095 వరకూ ఉంటుంది. ట్రైబర్ ధర * 80,000 , కైజర్ ధర రై 96,395 వరకూ తగ్గుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక శుక్రవారమే టాటా మోటార్సు వారు తమ కార్ల ధరను రేంజ్‌లను బట్టి రూ 65000 నుంచి రూ 1.45లక్షల పరిధిలో తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇతర కంపెనీల కన్నా ఈ కంపెనీ ఈ విషయంలో ముందుంది. సరికొత్త జిఎస్‌టి వ్యవస్థ ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తుంది. ఇందులో భాగంగా పెట్రోలు, ఎల్‌పిజి, సిఎన్‌జి వాహనాలు వాటి ఇంజన్ సామర్థం బట్టి ఇకపై 18 శాతం జిఎస్‌టి పరిధిలోకి చేరుతాయి. ఇక టాటా బైక్‌లు 350 సిసి సామర్థం వరకూ ఉన్నవి కూడా ఇప్పుడు 18 శాతం శ్లాబ్ పరిథిలోకి వస్తాయి. ఇంతకు ముందు ఇవి 28 శాతం పరిధిలో ఉండేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News