Friday, August 29, 2025

బస్సు ఆపలేదని డ్రైవర్ పై టిడిపి నేతల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్ టిసి బస్సు పై టిడిపి నేతల దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో చోటుచేసుకుంది. విజయవాడ టూ నిమ్మకూరు రూట్ లో తాము చెప్పిన చోట ఆపలేదని బస్సు అడ్డగించి టిడిపి నేతలు దాడి చేశారు. రిక్వెస్ట్ స్టాప్ లోనే ఆపుతామని బస్సు డ్రైవర్ చెప్పడంతో అతడితో టిడిపి మాజీ సర్పంచ్ జంపన వెంకటేశ్వరరావు, అనగన మురళి వాగ్వాదానికి దిగారు. బస్సు  డ్రైవర్‌ను కిందకు లాగి దాడిచేసేందుకు యత్నించారు. ఈ దౌర్జన్యాన్ని వీడియో తీసినందుకు కండక్టర్ పై కూడా దాడి చేయడానికి వెళ్తుండగా టిడిపి నేతలను ప్రయాణికులు ఆపారు. తమకు కేటాయించాని బస్టాప్ లో మాత్రమే బస్సు ఆపుతామని కండక్టర్ వివరణ ఇచ్చాడు. ఒకే గ్రామంలో రెండు మూడు సార్లు ఆపలేమని డ్రైవర్ తెలిపాడు.  టిడిపి కార్యకర్తలు దౌర్జన్యం ఎక్కువగా కనిపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. గ్రామాల్లో టిడిపి నాయకులు చెప్పిందే వేదం అన్నట్టుగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా మాజీ సర్పంచ్ పై కామెంట్లు చేస్తున్నారు.

Also read: టివి నటుడు లోబోకు జైలుశిక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News