Thursday, August 21, 2025

టిడిపి ఎంఎల్ఎ కండకావరం… ఫారెస్ట్ సిబ్బందిపై దాడి.. బండ బూతులు తిట్టాడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మద్యం మత్తులో శ్రీశైలం టిడిపి ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి ఫారెస్ట్ అధికారులపై దాడి చేశాడు. మంగళవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందిని అడ్డుకుని చెక్ పోస్ట్ వద్దే డ్రైవర్ ను టిడిపి ఎమ్మెల్యే చితక్కొట్టాడు. ట్రైబల్ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, ఈ రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని హెచ్చరించడంతో పాటు ఫారెస్టు సిబ్బంది అంతు చూస్తా అంటూ వారిని తీవ్ర పదజాలంతో దుర్బాషలాడాడు. ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కుని, వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా తిప్పాడు. అనంతరం తన గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్లి అనుచరులతో కలసి సిబ్బందిపై దాడి చేయించాడు. ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని ఫారెస్టు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. సిసిటివి ఫుటేజీని ఫారెస్ట్ అధికారులు విడుద‌ల చేశారు. అటవీ శాఖ సిబ్బంది రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లాలపై దాడి చేయడంతో సదరు ఎంఎల్ఎతో పాటు అనచురులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఎపి జూనియర్‌ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News